తాజ్ ట్రెపీజియం జోన్‌లో 454 చెట్లను అనుమతిలేకుండా నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ సంఖ్యలో చెట్లను నరకడం ఒక మనిషిని చంపడం కంటే ఏమాత్రం తీసిపోని నేరమని వ్యాఖ్యానించింది. మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ యాజమాన్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఒక్కో చెట్టుకు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. పర్యావరణ నాశనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేసింది.