పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నివేశన స్థలాల కోసం అర్జీలను గ్రామ కార్యదర్శికి ప్రజలు అందించారు. సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు అందించినట్లు తెలిపారు. 90శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.