పొన్నూరు పట్టణంలోని 7, 26వ వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పర్యటించారు. 7వవార్డులో రోడ్ల వెంబడి చెత్త వ్యర్ధాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 26వ వార్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న గృహ వినియోగ పరికరాలను తీసివేయాలని సూచించారు. పట్టణంలో రోడ్లపై కాలువల్లో చెత్తా, చెదారం వ్యర్ధాలను వేస్తే చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.