లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన రేపల్లె పట్టణంలోని పెద్ద మసీదు వద్ద గురువారం జరిగింది. భట్టిప్రోలు మండలం పల్లి కోన గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావును ఏపీ 07టి టి 7767 నెంబర్ గల లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మృతుని తమ్ముడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జునరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.