చెరుకుపల్లి మండలంలోని గ్రామాలలో పచ్చిరొట్ట పైరు వేసిన పొలాలను మండల వ్యవసాయ అధికారి బాలాజీ గంగాధర్ బుధవారం పరిశీలించారు. జీలుగ 408 ఎకరాలలో జనుము 227 ఎకరాలలో పిల్లి పెసర 494 ఎకరాలలో పచ్చిరొట్ట సాగు ఉందని తెలిపారు. పైరు వేసిన 20-30 రోజులకు లేదా 50% పూతదశలో నేలలో కలియ దున్నితే భూసారం పెరిగి మంచి పోషక విలువలు నేలకు అందుతాయి అన్నారు. రైతులందరూ పచ్చిరొట్ట పైరుతో ఉపయోగాలు తెలుసుకుని ఆచరించాలని కోరారు.