భట్టిప్రోలు: రాష్ట్ర బడ్జెట్ లో చేనేతలకు నిధులు కేటాయించాలి

58చూసినవారు
భట్టిప్రోలు: రాష్ట్ర బడ్జెట్ లో చేనేతలకు నిధులు కేటాయించాలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2. 94 లక్షల కోట్ల బడ్జెట్ లో చేనేత పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ అన్నారు. మంగళవారం భట్టిప్రోలు ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడంతోపాటు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్