చెరుకుపల్లి మండలంలో సోమవారం రాష్ట్రస్థాయి నాటు బండి పూటీ ఎడ్ల పోటీలు ప్రారంభం అయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రైతులకు ఆటవిడుపుగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.