చెరుకుపల్లి లో భారీ వర్షం

2916చూసినవారు
చెరుకుపల్లిలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం దంచికొట్టడంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో ఫ్లెక్సీలు నేలకొరిగాయి. చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లపై వేసుకునే పరదాలు సైతం ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.