మాజీ సీఎం జగన్ గత ఐదు సంవత్సరాలు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఇప్పుడు బురదజల్లే రాజకీయాలకు తెర తీశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గురువారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఎన్ని అరాచకాలు జరిగిన బయటకు రాని జగన్ ఇప్పుడు శవరాజకీయాలు చేసేందుకు బయటికి వస్తున్నాడన్నారు. గత ఐదేళ్లలో వరదలు వస్తే ఏరియల్ సర్వే, అరాచకాలు జరిగితే మహిళా కమిషన్ ను పంపడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు.