రొంపిచర్ల: గోగులపాడులో పల్లె పండుగ కార్యక్రమం
గోగులపాడు గ్రామంలో మంగళవారం "పల్లె పండుగ" కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. గంగమ్మ తల్లి గుడి దగ్గర నుండి పోలేరమ్మ తల్లి గుడి వరకు సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అనంతరం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.