నకరికల్లు మండలంలోని నరసింగపాడు, గుండ్లపల్లి గ్రామాలలో కోతకు సిద్ధమైన వరిపొలాలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి మురళి పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలను వెంటనే కంబైన్ హార్వెస్టర్చే నూర్పిడి చేయించాలన్నారు. ధాన్యాన్ని అమ్ముకోవాలనుకునేవారు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించాలన్నారు. వ్యవసాయ