నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరమని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు.