నకరికల్లులో శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

72చూసినవారు
కరికల్లు మండలంలోని నరసింగపాడులో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, రుద్ర హోమాలు తదితర పూజలు చేశారు. ఆలయంలో శనీశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్