రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకానుంది. క్యాబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.