తాడికొండ పాఠశాల ఆశయం గొప్పదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి, డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ కావాలని గొప్ప గొప్ప కలలు కనాలని, వాటి సాకారానికి కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ గ్రామాల నుంచే వచ్చారని చెప్పారు.