తెనాలి పట్టణంలోని యడ్ల లింగయ్య కాలనీలో మంగళవారం దీపం పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి స్వయంగా గ్యాస్ పొయ్యి వెలిగించారు. అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడుతూ సిలిండర్ ఇచ్చిన వారికి ముందుగా డబ్బులు చెల్లిస్తే 48 గంటల్లో వారి ఖాతాలో నగదు జమవుతున్నాయని తెలిపారు.