హైందవ శంఖారావం సభకు ఆదివారం హిందువులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సభకు తరలివెళ్తున్న వారికి విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తేనీరు, బిస్కెట్లు, మజ్జిగ, పులిహోర, తాగునీటిని ఆదివారం అందించారు. హైందవ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైందవ ధర్మపరిరక్షణ అందరి సమష్టి బాధ్యతని ఎమ్మెల్యే అన్నారు.