AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మా ప్రభుత్వంలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నేడు అనారోగ్యప్రదేశ్‌గా మార్చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిర్వహణ కూడా థర్డ్ పార్టీకి అప్పగించాలని చూస్తున్నారు. ఆరోగ్యశ్రీని వ్యాపారం చేయవద్దు.. ఇలాంటి చర్యలను వైసీపీ వ్యతిరేకిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య ఆసరా ఊసే లేదు' అని ఆమె విమర్శించారు.