మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తాజా పరిణామాలపై ట్వీట్ చేశారు. ‘నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగి వస్తాం. ఈ అబద్దాలు నన్ను దెబ్బతీయాలేవ్. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయ్. . నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుంది’. అని తెలిపారు.