అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాంకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో న్యాయస్థానం ఆశారాంకు మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, గుజరాత్ మోతేరాలోని ఆశారాం ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో కోర్టు ఆయనకు జీవితఖైదు విధించింది.