శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

62చూసినవారు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
శ్రీశైలం జలశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జురాల ప్రాజెక్టు నుంచి 22,52,05 క్యూసెక్కులు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 2,095 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 855.20 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదత్పత్తి చేసి 31,784 క్యూసెక్కుల నీటని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్