2020 ఎన్నికల సమయంలో 'మెటా' సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తనపై కుట్ర పన్నాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో కూడా మోసం చేస్తే జుకర్బర్గ్ తన జీవితాంతం జైలులోనే ఉంటాడని.. ట్రంప్ తన పుస్తకం 'సేవ్ అమెరికా'లో రాసుకొచ్చారు. "అతను ఈసారి ఏదైనా చట్టవిరుద్ధం చేస్తే తన జీవితాంతం జైలులోనే గడుపుతాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు మోసం చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది" అని తెలిపారు.