ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి నిర్ధారణకు ఏపీ మెడ్‌టెక్ జోన్ అభివృద్ధి చేసిన ఆర్టీ-పీసీఆర్ కిట్ ‘ఎర్బాఎండీఎక్స్’ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మెడ్‌టెక్ తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి దీన్ని తయారు చేసింది. ఈ విషయాన్ని సీఎం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్.. ప్రపంచవేదికపై ‘మేక్‌ఇన్ ఏపీ’ ఖ్యాతిని ఘనంగా చాటుతోందన్నారు. ఈ కిట్ తయారీ బృందాన్ని సీఎం అభినందించారు.