గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు భాషకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్.. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.