ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

80చూసినవారు
ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీని వర్షాలు వీడటం లేదు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్