సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అందజేశారు. వరద బాధితుల సహాయార్థం పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. అలాగే, ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.కోటి ఇస్తానని వెల్లడించారు.