సరిహద్దులో బలగాల ఉపసంహరణ షురూ

72చూసినవారు
సరిహద్దులో బలగాల ఉపసంహరణ షురూ
వాస్తవాధీన రేఖ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, చైనా ఇటీవల ఏకాభిప్రాయానికి వచ్చి కీలకమైన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం మేరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని రెండు కీలక ప్రాంతాలైన డెప్సాంగ్, డెమ్‌చోక్‌ల నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నట్లు భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్