AP: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో), సీఆర్‌డీఏ సంస్థలు ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాజధాని అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో 22న ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హడ్కో బోర్డు అమరావతి నిర్మాణాలకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. త్వరలో ఈ నిధులను విడుదల చేయనుంది.