ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. ఆయన పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.