పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివారు. తరువాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేశారు.