ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు చెన్నై మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లను చూసేవారు తాము ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషను నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషను వరకు రానూపోను మెట్రో రైలు సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు సీఎంఆర్‌ఎల్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సదుపాయం మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే ఉంటుందని తెలిపింది.