మాంసాహారుల్లో కొమొడో డ్రాగన్ ఒకటి. ఇది చాలా బలిష్టంగా ఉంటుంది. చిన్న చిన్న జంతువులను అమాంతం మింగేస్తుంది. తాజాగా కొమొడో డ్రాగన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. వేటలో భాగంగా గేదెలను చూసి వాటిపైకి వెళ్లింది డ్రాగన్. అయితే ఓ గేదె దానిపైకి తిరగబడింది. తన కొమ్ములతో డ్రాగన్‌పై దాడి చేయడంతో అది పారిపోయింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.