భారీ పేలుడు.. వ్యక్తి సజీవదహనం

71చూసినవారు
భారీ పేలుడు.. వ్యక్తి సజీవదహనం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొల్లూరుపల్లి శివారు ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. టపాకాయలు నిల్వ చేసిన గోడౌన్‌లో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌ వాచ్‌మెన్ సజీవదహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్