AP: వైసీపీ మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు తాను పోరాటం ఆపనన్నారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారంటీ అయిపోయింది. పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు, బెల్టు షాపులు పెడుతున్నారు. జగన్ కటౌట్‌కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతుంది.’ అని రోజా అన్నారు.