అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి కథలు రాసుకుంటా: RGV

56చూసినవారు
అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి కథలు రాసుకుంటా: RGV
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. నేడు ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తనపై నమోదైన కేసులు, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై వర్మ అసహనం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్