నేడు వైసీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

53చూసినవారు
నేడు వైసీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు
AP: వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6 గంటలకి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు. విజయవాడలోని NAC కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, భారీగా ముస్లింలు పాల్గొంటున్న కారణంగా.. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.