రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రధాని మోదీ ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది ముస్లిం కుటుంబాలకు ఈద్ కు ఒక రోజు ముందు ‘సౌగత్-ఇ-మోదీ’ పేరిట తోఫా కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో కొత్త దుస్తులు, సేమియాలు, ఖర్జరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయని కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి.