ఉద్యోగులందరికీ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు EPFO నుంచి నగదును విత్ డ్రా చేసుకోవడానికి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. అయితే తాజాగా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని సులభతరం చేయనున్నట్లు పేర్కొంది. ఉద్యోగులు తమ పీఎఫ్ నగదును యూపీఐ ద్వారా తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.