ఏప్రిల్ 7 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

54చూసినవారు
ఏప్రిల్ 7 నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రాష్ట్రంలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం రూ. 3,500 కోట్లు చెల్లించాల్సి  ఉందని, పాత బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించలేమని తేల్చి చెప్పింది. బకాయి నిధులు చెల్లించాలని ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్