బ్రిటన్‌కు వెళ్లే స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీసా (6నెలల గడువు) ఫీజు 115 పౌండ్లు ఉండగా.. 127 పౌండ్లకు చేరుకుంది. అదే రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుమును ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. అది 524 పౌండ్లకు చేరనుంది. ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.