ఏపీలో స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14న అన్ని స్కూళ్లలో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ వాయిదా పడిందని తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని విద్యాశాఖ పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.