దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 984 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 324 పాయింట్ల నష్టంతో 23,559.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.38గా ఉంది. NTPC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.