ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కడదొడ్డి గ్రామ సర్పంచ్ హుసేనితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు తోవి వినోద్, మజ్జిగ సూరి ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. 10 రోజుల కిందట బాలిక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సర్పంచ్‌తో పాటు ఇద్దరు యువకులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై మంగళవారం కోసిగి పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.