ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంచుతూ శనివారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను కేంద్రం 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని రాష్ట్రం కోరింది. రాష్ట్ర సిఫార్సు మేరకు ఐపీఎస్‌లను పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యూటేషన్ రిజర్వ్‌గా 23 మందిని నిర్దేశించింది.