వాట్సప్‌లో ఇంటర్ ఫలితాలు

80చూసినవారు
వాట్సప్‌లో ఇంటర్ ఫలితాలు
AP: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12-15 మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి వాట్సప్‌లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడీఎఫ్ రూపంలో ఇవ్వనున్నారు. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్‌లైన్‌లో ఉంచేవారు. ఈసారి వాట్సప్‌లో ఫలితాలు విడుదల చేసి.. పీడీఎఫ్ రూపంలో మార్కుల మెమోలు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్