ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీపావళి నుంచి దీపం పథకం అమలు కానుంది. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైనే ప్రభుత్వం నడుస్తోంది. డిసెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే నిధులు కేటాయించి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. కాస్త ఆలస్యమైనా ప్రజలపై భారం పడకుండా పథకాలను అమలు చేయనుందట.