శభాష్‌ పోలీస్‌ అన్నలు.. గ్రూప్-1 అభ్యర్థులకు సాయం

70చూసినవారు
దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు సిబ్బంది విషయం తెలుసుకుని ఆమెకు సాయం చేశాడు. వెంటనే ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని సకాలంలో సరైన పరీక్షా కేంద్రం వద్ద దింపాడు. ఇలాగే కీసరలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో గమనించిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజనీరింగ్‌ కాలేజీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్