AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 7కిమీ వేగంతో తూర్పు-ఈశాన్య దిశగా వాయుగుండం కదులుతోంది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.