అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్ ఛీత్కారానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్‌కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు.