ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ సెఫ్టీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరతామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన వినియోగదారుల దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రొడక్ట్ నాణ్యత, సేవలలో తప్పులు ఉంటే సోషల్ మీడియాలో ప్రజల్లోకి యువత తీసుకువెళ్ళాలన్నారు. బలమైన చట్టాలను ప్రజలు వినియోగించు కోవాలని మంత్రి స్పష్టం చేశారు.